ఆదివాసులు – చట్టాలు/అభివృద్ధి (Adivasulu-Chattalu/ Abhivrudhi ) – కె. బాలగోపాల్ ఆదివాసులు భూమి హక్కులను పరిరక్షించే చట్టాలలో 1 ఆఫ్ 70 చాలా ముఖ్యమైనది. అయినా దాని అమలుకు జరిగిన కృషికంటే ఉల్లంఘించడానికి జరిగిన ప్రయత్నాలే ఎక్కువ. ఏజెన్సీలో ఆదివాసీయేతరులెవరూ మైనింగ్ వంటి పనులు చేపట్టకూడదనీ సుప్రీంకోర్టు సమతా కేసులో ఇచ్చిన తీర్పుని కూడా ఉల్లంఘించడానికే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. “అందమైన చట్టాలను నమ్ముకుని నష్టపోయామా అన్న ప్రశ్న ఇవ్వాళ ఆదివాసులు వేసుకొంటున్నారు. నిజానికి తప్పు అక్కడ లేదు. చట్టం వచ్చేసింది కాబట్టి ఇంక రాజకీయ సమీకరణ అక్కరలేదన్న నిర్లక్ష్యంలో ఉంది. కమ్యూనిస్టుల వంటి రాజకీయ శక్తులు చట్టాలను వాటి అమలునూ అసలే పట్టించు కోకుండా ఒక రకంగా నష్టం చేస్తే , ఎన్జీవోలు వచ్చి చట్టం ఉంటే ఇంక రాజకీయ ఉద్యమాలెందుకు అని అటువైపునుండి అంతే పొరపాటు చేస్తున్నాయి” …… అనంటాడు బాలగోపాల్. ఇవి 20 ఏళ్ల కాలంలో బాలగోపాల్ రాసినవాటిలో కొన్ని వ్యాసాలు. ఇందులో ప్రధానంగా ఆదివాసీ చట్టాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలను,’అభివృద్ధి’ పేరు మీద జరుగుతున్న అన్యాయాలను బాలగోపాల్ చర్చకు పెట్టారు.
Essays
Adivasulu-Chattalu/ Abhivrudhi
₹130.00
+ 50₹ (Postal Charges)Author – K. Balagopal
Publisher – Perspectives
Pages – 176

Reviews
There are no reviews yet.