కవిత్వం చాలా అంటే చాలా నెమ్మదిగానే చదువుకోవాలి. అందులో యుద్ధ ప్రకంపనలే వున్నా, తుఫాను తుమ్మెదలే హోరెత్తిస్తున్నా సరే! అందులోనూ నరేష్కుమార్ సూఫీ వాక్యాలు మరీ నెమ్మదిగా చదువుకోవాలి. ఇది వొక లాంగ్ మార్చ్ అడుగు తీసి అడుగు వేస్తున్నట్టుగా, వొక్కో అడుగునీ పరీక్షించుకున్నట్టుగా వుంటుంది. నిద్రకి చెల్లుచీటీ ఇచ్చేసిన అర్థరాత్రి కళ్ల మీద వాలే చిమ్మచీకట్లో వొకటి రెండు నక్షత్రాల కన్నీటి చుక్కలు వొలికినట్టుగా కూడా వుంటుంది.
– అఫ్సర్
Reviews
There are no reviews yet.