ఈ ప్రత్యేకత తీసుకొన్న వస్తువుల ఉనికికి సంబంధించిందా, చెప్పిన పద్ధతులకు చెందినదా అనేది అంత తేలిగ్గా చెప్పగలిగేది కాదు. ప్రతి కథలోనూ ఒక రహస్య స్వరం ఏవో కొన్ని అతీత అంశాలను చింతన చేస్తూ వినిపిస్తుంది. అదొక అభౌతిక స్వరం కూడా కావొచ్చు. అందుకే ఇవి అపురూప చింతన కథలు. ఇందులోని చాలా కథలు అంతర్జాల పత్రిక ‘ఉదయిని’ కోసం కథకుడు బి.అజయ్ ప్రసాద్ ప్రత్యేకంగా ఏరి కూర్చిన కథలు. వీటిని ప్రచురించడానికి కుమార్ కూనపరాజు చేస్తున్న సాహిత్య కృషి తెలుగు కథా సాహిత్యంలో కొత్త వంగడాలను సృష్టిస్తుందని నమ్మకంగా చెప్పొచ్చు.
- డా.కాకుమాని శ్రీనివాసరావు
Reviews
There are no reviews yet.