దళిత(వ్యాసాలు)-కె.బాలగోపాల్ Dalit కారంచేడు, చుండూరు వంటి దాడులు కులవ్యవస్థలో ఉండే భౌతికదౌర్జన్యాన్నీ హింసనూ కళ్ళకు కట్టినట్లు చూపించాయి. ఆ హింస వెనుక దాగివున్న అమానుష విషవ్యవస్థ పై చర్చను సమాజంలో ఆహ్వానించాయి. మండల్ కమీషన్ ప్రతిపాదనలను అమలు చేస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కులవ్యవస్థలోని భౌతిక హింసేకాక, తాత్విక హింస కూడాబయటపడింది .సంపూర్ణమైన మనుషులుగా దళితులకు గుర్తింపు ఇవ్వని బ్రాహ్మణీయ సంస్కృతి కొత్త కొత్త నినాదాలతో , ఆధునిక పరిభాషతో ముందుకు వచ్చింది. భౌతిక దాడులనూ హింసనూ అరికడితే చాలదనీ.. సామాజిక నిర్మాణం, సంస్కృతి , భావజాలం తదితర అన్ని రంగాల్లో కులనిర్మూలనకోసం కృషి జరగక పోతే ఆ హింసకు పునాది అయిన వ్యవస్థ నాశనం కాదనీ ‘మండల్’ సంఘర్షణ సూటిగా స్పష్టం చేసింది అంటాడు బాలగోపాల్. భారత సమాజంలో అనాదిగా ఉన్న కుల వ్యవస్థలోని అణచివేత, తాత్విక హింసలను ఇవాళ దళిత ఉద్యమాలు ప్రశ్నిస్తున్నాయి. కులానికి, పౌరహక్కుల రంగానికి ఉన్న సంబంధాన్ని గుర్తించిన బాలగోపాల్ రాసిన 33 వ్యాసాల సంకలనమే ‘దళిత .
Essays
Dalita
₹240.00
+ 50₹ (Postal Charges)Author – K. Balagopal
Publisher – Perspectives
Pages – 241

Reviews
There are no reviews yet.