ఈ దేశంలో మహిళల అస్తిత్వం ఎప్పుడూ సంక్షోభంలోనే ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న కశ్మీరీ మహిళల అంతరంగం ఏమై ఉంటుంది ? అది సముద్రమంత లోతైన గాయాన్ని కలిగి ఉంటుంది. అయినా వాళ్ళు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది 30 ఏళ్ళు గడిచినా తెల్లవారనిరాత్రి కథ. కశ్మీర్ ఒక పంజరం. 1991 ఫిబ్రవరి 23-24 తేదీల్లో ఉత్తర కశ్మీర్ లోని సరిహద్దు జంట గ్రామాలైన కునన్ పుష్పోరాలలో భారత సైన్యం చేతిలో అక్కడి స్త్రీలందరూ అత్యాచారానికి గురి అయ్యారు. ఈ ఘటనలో బతికిన వారు దీర్ఘకాలిక సెక్సువల్ జబ్బులకు గురయ్యారు. కుటుంబాలకు కుటుంబాలు నాశనమయ్యాయి. అయినా వాళ్ళు తమ ఆత్మగౌరవ పోరాటం 30 ఏళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ దారుణాన్ని బహిర్గతం చేస్తూ ఈ అయిదుగురు రాసిన ఈ పుస్తకం ఒక స్మృతి, ఒక నివాళి. ఒక విస్మృత వ్యతిరేక పోరాటం. స్త్రీలపై సాయుధ లైంగిక హింసను ధైర్యంగా బయటపెట్టిన రిపోర్టులు. ఈ పుస్తకం రేప్,చిత్రహింస, ఇంకా ఇతర దురాగతాల చుట్టూ ఉండే మౌనం శిక్షలేమిని పెంచి పోషించేలా ఎలా ఉంటుందో చూపిస్తుంది. కునన్ పోష్పోరా కథ వీటన్నిటినే కాక ఎన్నింటినో మనకు విశదపరుస్తుంది.
Essays
Kunan Poshpora
₹200.00
+ 50₹ (Postal Charges)Publisher – Perspectives
Translator – ల.లి.త
Pages – 250

Reviews
There are no reviews yet.