కవిత్వాన్ని రాస్తున్న సమయాన్ని అత్యంత కల్లోల సమయంగానే గుర్తించాలి. అది సున్నితమైన పువ్వుని గురించైనా, రక్తాన్ని చిందించగలిగే ముల్లుగురించైనా… కవిత్వమనేది రాస్తున్నప్పుడు మనసు లేదా ఆలోచన వేగంగా కదులుతూనే ఉంటుంది. నిజానికి అలాంటి ఉన్మత్త స్థితి మాత్రమే నిజమైన కవిత్వాన్ని ఇస్తుంది. ఆ తాదాత్మ్యతని అనుభవించగలగటమే కవిత్వం రాసేవారికి అందే ఒకానొక అద్బుతమైన అనుభవం. అంతే అంతకు మించి ఏమీ లేదు.
ఇక్కడ మిగుల్చుకున్న వాక్యాలన్నీ పాఠకులకూ అందే ఎస్సెన్స్ ఆఫ్ థాట్స్. చదువుతున్న పాఠకులకి ఎప్పుడూ దాచుకోదగిన, మళ్లీమళ్లీ అక్షరాలతో గాయపరుచుకోగలిగిన అనుభవాన్నివ్వగలవు. ఇది సుకుమార భావప్రకటణా కాదు, అట్లాగని పూర్తి ధిక్కార ప్రకటనా కాదు. ఇది ఒక బిడ్డకి తల్లి మందలింపులాంటి ఎక్స్ప్రెషన్. ప్రేమా, ఆగ్రహమూ కలిసిన ఈ కవిత్వం మనలోని రకరకాల ఆలోచనలనీ, కొన్ని ఒంటరి సమయాలనీ ఆక్రమించుకోగల ఘాటైన అత్తరులాంటిది
Author – Rupa Rukmini.k
Publisher – Kavisangamam
Pages – 118
Reviews
There are no reviews yet.