Sale!
,

Naxlite Udyamam- Veluguneedalu

Original price was: ₹320.00.Current price is: ₹300.00.

+ 40₹ (Postal Charges)

Author – K. Balagopal
Publisher – Perspectives
Pages – 312

నక్సలైట్ ఉద్యమం/వెలుగునీడలు Naxlite Udyamam- Veluguneedalu(కె. బాలగోపాల్) ఇందులోని వ్యాసాలన్నీ చాలా వరకు విప్లవ పార్టీల ఆచరణకు సంబంధించినవే. రాజ్య వ్యవస్థ ఒక రాజ్యాంగాన్ని రూపొందించి ఆ ప్రమాణాల మీద పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చింది. అందుకే రాజ్యాన్ని సంస్థల నుంచి వ్యక్తుల దాకా ఆ లీగల్ చట్రం నుండే దాన్ని ప్రశ్నిస్తారు. దళిత బహుజనుల పట్ల విప్లవోద్యమం తీసుకున్న వైఖరి గానీ, కుల సంబంధాలు గానీ,రాయలసీమ ఫ్యాక్షనలిజం గానీ, శాంతి చర్చలుగానీ – ఆయన విశ్లేషణలో వైరుధ్యాలు కనపడవు. తన దృక్పథంలో విశ్లేషణలో మార్పు వచ్చినప్పుడు నిజాయితీగా వివరణ ఇచ్చి,ఆ మార్పుని కూడా వివరిస్తూ చెప్పాడు. ఉద్యమాలు దెబ్బతిన్నా, అవి పని చేసిన ప్రాంతాల్లో ప్రజలకు నిబ్బరం ఇవ్వగలగాలి. అందుకు కావాల్సిన ఆత్మస్థైర్యం ఉద్యమాలు ప్రజలకు ఇవ్వగలిగితే, ఏ కారణంగా ఆ ఉద్యమం దూరమైనా ఫలితాన్ని మిగిలించి పోతుంది అంటాడు బాలగోపాల్. సమాజాన్ని మార్చే బాధ్యత తన మీద వేసుకొన్న విప్లవోద్యమం సంయమనాన్ని పాటించాలని, తమ ఆచరణను విలువల పునాదుల మీద నిలపాలని బాలగోపాల్ బలంగా నమ్మాడు. ఆయన విప్లవోద్యమం మీద ఎన్నో విమర్శలు పెట్టి ఉండవచ్చు కానీ ఇవి విప్లవోద్యమవ్యతిరేక వ్యాసాలు కావు. విమర్శ వేరు; వ్యతిరేకత వేరు. 50 ఏళ్ల నక్సల్బరీ ఉద్యమ సందర్భంలో కూడా గుర్తుచేసుకో దగ్గ 40 వ్యాసాలు ఇవి

Reviews

There are no reviews yet.

Be the first to review “Naxlite Udyamam- Veluguneedalu”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart