నాలుగు సంవత్సరాలలో ఒక నవల మీద 25 మంది పీహెడ్ చేశారు. మరో 25 మంది ఎం.ఫిల్ వ్యాసాలు సమర్పించారు. అంతగా ఏమున్నదా నవలలో? ఒక నవల రాయటానికి పదేళ్లకు పైగానే పరిశోధన చేసి మరీ రాసిన రచయిత ఇందులో ఏం చెప్పాడు??
నిజానికి ఓ అద్భుతాన్ని పేజీల్లో నింపి తెచ్చాడు రా. ముత్తునాగు. ఆయన జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని మరింత విలువైన చరిత్రని పట్టుకోవడం కోసమే వెచ్చించారు. గ్రామీణ తమిళ భూమి ఆత్మగీతంలా అనిపిస్తుంది. తెలుగు ప్రాంతాల వలసలనీ గుర్తు చేస్తుంది. రెండు ప్రాంతాల, రెండు భాషల పౌరుల దగ్గరితనాన్ని గుర్తు చేస్తుంది. ఇది కేవలం కథ కాదు — కాలానికి అద్దమై, మట్టిలో, వృత్తిలో, విశ్వాసంలో మునిగిన మనిషి జీవన రాగం.
ఈ నవల బాగా పురాతన కాలాన్ని, ముఖ్యంగా 18వ శతాబ్దం తర్వాత రెండు ప్రదేశాల్లోని — తమిళనాడు ప్రాంతంలోని “కన్నివాడి పాళ్యం” (పలయం) పరిధిలోని ప్రజల జీవితం, భూ వ్యవహారాలు, సామాజిక జీవితాలను కళ్లముందు నిలిపిన నవల. కుల వ్యవస్థ, భూఅధికారం, వైద్యం, సంప్రదాయ జీవితం ఎలా ఉండేదో చెబుతూనే… కుల బహిష్కరణల పేరిట పాలకుల దోపిడీనీ, అదే కాలంలో దక్షిణ భారతాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న ముస్లిం పాలకుల క్రమాన్నీ చెబుతుంది.






Reviews
There are no reviews yet.