Teeram Chere Daaka

200.00

+ 50₹ (Postal Charges)

Author – Dinnesh

Pages – 177

Publisher – Bala Books

Category: Tag:

తీరం చేరే దాకా అనేది పదమూడు కథల సంపుటి. ఈ కథలన్నీ స్త్రీ ప్రధానంగానే ఉంటూ కథనాలు ముందుకి సాగుతాయి. ఇంట గెలిచాక రచ్చ గెలవమన్నారు. మన ఇంట్లో స్త్రీలని గౌరవించుకుని అర్థంచేసుకున్నప్పుడే సమాజంలో ఇతర స్త్రీలని గౌరవించి, అర్థంచేసుకునే మానసిక దృక్పథం ఏర్పడుతుంది. అందుకే ఈ పదమూడు కథలు, గర్భంలో పిండం దశ నుండి జీవితం చివరి దశ వరకు స్త్రీ జీవితంతో ముడి పడి ఉండే కొత్తతరం మానవ సంబంధాల గురించి, ఆ సంబంధాల దృశ్యా పురుషులు స్త్రీలపై తరతరాలుగా మోపబడ్డ ఆంక్షలు, పెత్తనాల గురించి, అవి వారిపై చూపే ప్రభావం గురించి, మారుతున్న ప్రపంచంలో ఆధునిక స్త్రీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, కోరికలు, సమస్యల గురించి… ఆధునిక మానసిక దృష్టికోణంలో అర్బన్, సెమీ-అర్బన్ నేపథ్యంలో చర్చించడం జరిగింది. స్త్రీల జీవితాలలో కేవలం పురుషులు చేసే తప్పిదాలే కాకుండా ఆ తప్పిదాల వెనుక స్త్రీల యొక్క పాత్ర, ప్రోద్బలం ఎంతగా ఉన్నదో ఈ కథల ద్వారా శోధించే ప్రయోగం చేయడం జరిగింది. కథలన్నీ స్త్రీ ప్రధానమే అయినా తటస్థ దృక్కోణం నుండి మానవ సంబంధాలని చూసి అర్థంచేసుకునే ప్రయత్నమే ఈ కథ సంపుటి ప్రధాన లక్ష్యం. కథనంలో వేగం, వైవిధ్యం, వ్యంగ్యం ఈ కథ సంపుటి ప్రధాన లక్షణాలు. నా చుట్టూ నిత్యం జరిగినవి చూస్తూ, వింటూ… ఒక నిస్సహాయ స్థితిలో నా కలం నుండి జారిపోయిన అక్షరాలే ఈ కథలు. – దినేష్

Reviews

There are no reviews yet.

Be the first to review “Teeram Chere Daaka”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Teeram Chere DaakaTeeram Chere Daaka
200.00